రామభద్రపురం: జనసేవ న్యూస్
కోవిడ్ ధర్డ్ వేవ్ విజ్రుంభన,ఒమిక్రాన్ ఎక్కువగా పిల్లలు,వ్రుద్ధులపై ప్రభావం చూపుతున్నందున విద్యార్ధిని,విద్యార్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బాపూజీ గ్రామీణాభివృద్ధి సంఘం ఆద్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గురువారం ఉదయం స్థానిక మండల పరిధిలోని కొట్టక్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నెహ్రూ యువ కేంద్రం సహకారంతో బడిబయట ఆడపిల్లలకు,15నుండి29 సంవత్సరాల మధ్య మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ అప్పికొండ అనూరాధ చేతులమీదుగా ప్రారంభించుకొని,డ్వాక్రా మహిళలకు,విద్యార్ధిని విద్యార్ధులకు కరోనా,ఒమిక్రాన్ లపై అవగాహన కల్పించారు.
బయటకు వచ్చేటపుడు తప్పకుండా మాస్క్ ధరించాలని,భౌతికదూరం పాటించడంతో పాటు పిల్లలు వేడినీటిని తాగుతూ పౌష్టికాహారం వాడాలని కోరారు.
విజయనగరం జిల్లా స్వచ్ఛంద సంస్థల సమైఖ్య అద్యక్షులు మమ్ముల తిరుపతిరావు,ప్రధానోపాద్యాయుడు రావాడ బాస్కరరావు,సుధ,బాపూజీ గ్రామీణాభివృద్ధి సంఘం కార్యదర్శి గేదెల తిరుపతిరావు పాల్గొన్నారు.