విశాఖ అభివృద్ధి సమావేశములకుటీడీపీని భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ మరియు జివిఎంసి కమిషనర్ నుకోరి వినతి పత్రం సమర్పించిన టీడీపీ పార్టీ నాయకులు
గాజువాక నియోజక అభివృద్ది పైన కలక్టర్ గారు నిర్వహించిన సమీక్ష కార్యక్రమానికి ప్రతిపక్ష కార్పొరేటర్ల ను పిలవకపోవడం వలన ఈ రోజు విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ,జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావుగారు విశాఖ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్,మరియు మిగిలిన ప్రతిపక్ష కార్పొరేటర్లు అందరూ కలెక్టర్ గారిని కలిసి ప్రోటోకాల్ సంబంధింత విషయమై వినతిపత్రం అందజేయడం జరిగింది. ఇక ముందు నియోజకవర్గ అభివృద్ధి పై కలెక్టర్ గారు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి కార్పొరేటర్ ను పిలవాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ సమస్యపై జివిఎంసి కమిషనర్ లక్ష్మీ షా గారిని కూడా కలవడం జరిగింది .ఈ కార్యక్రమాలలో సీపీఐ సీ.పీ.ఎం. ఫోర్ లీడర్లు స్టాలిన్ ,గంగారాం మరియు టీడిపి కార్పొరేటర్లు గంధం శ్రీనివాస రావు, పల్లా శ్రీనివాస్, రౌతు శ్రీనివాస్, బల్ల శ్రీనివాసరావు, పులి లక్ష్మీబాయి , గంట అప్పలకొండ, పిల్ల మంగమ్మ, శరగడం రాజశేఖర్, బొమ్మిడి రమణ, మొల్లి ముత్యాల నాయుడు, బొండ జగన్, , తెలుగుదేశం సీనియర్ నాయకులు గాడు అప్పలనాయుడు,మొల్లి లక్ష్మణరావు, గొలగాన పోలారావు, రాజశేఖర్ మరియు జనసేన కార్పొరేటర్ గోవింద రెడ్డి పాల్గొన్నారు.