భీమునిపట్నం జనసేవ న్యూస్ :
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 23మద్యం బాటిళ్లును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని స్థానిక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో( ఎస్ ఈ బి) ఇన్స్పెక్టర్ వి.రామకృష్ట మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సెబ్ ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ తన సిబ్బందితో గురువారం విస్తృత దాడులు నిర్వహించగా మండలంలోని తాటి తూరు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయస్తున్న వ్యక్తి నుండి 14(180ml) మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు.అలాగే ఆనందపురం మండలంలో సెబ్ ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ తన సిబ్బందితో గురువారం విస్తృత దాడులు నిర్వహించగా మండలంలోని కుసులవాడ గ్రామంలో అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తిని 09(180ml) మద్యం సీసాలు తో పట్టుకొని రెండు వేరువేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ఈ దాడులలో సెబ్ ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ ఎస్ఐ పద్మావతి సిబ్బంది పాల్గొన్నారు..
భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్
#janasevanews #trendingnews, #Ap #Tdp #Ysrcp #Congress #Politics #Viralnews #Telugunews #Hyderabad #CBN #Jagan #Seb #Bhemili #Visakhapatnam #Alcohol #Smugling #180ml #arrest