యుగ పురుషుడు ఎన్టీఆర్ :


 ఆనందపురం : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు గారి పుట్టినరోజు వేడుకలను భీమిలి నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ రాజబాబు గారి ఆదేశాల మేరకు మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆ పార్టీ జాతీయ కార్యాలయం మంగళగిరి లో ఘనంగా నిర్వహించారు.

 ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ చిత్ర పటానికి పూల మాల వేసి, నివాళులర్పించారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ ఎన్టీఆర్ చరిత్రను చూస్తే ఒక మనిషి తన జీవితంలో ఇన్ని సాధించగలడా అని ఆశ్చర్యం వేస్తుందని, ఎన్టీఆర్ గారిని సినీ రంగంలో వెండితెర వేలుపుగా, రాజకీయ రంగంలో పేదల పాలిటి దేవుడిగా అన్ని వర్గాల ప్రజలు కొలిచారు  అని, ఇలా రెండు రంగాలలోనూ దైవత్వాన్ని కనబరిచిన అరుదైన చరిత్ర ఎన్టీఆర్ గారి సొంతం అని అన్నారు. దేశ రాజకీయాలలో సంక్షేమ శకానికి నాంది పలికి, సమాజానికి బీజం వేసిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని, ముఖ్యంగా తెలుగు జాతికి ఆ మహానుభావుడు చేసిన  సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. నివాళిగా సంవత్సర కాలం పాటు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహించటం సంతోషకరమని,
తెలుగు గడ్డపై తరతరాలు ఎన్టీఆర్ గురించి చెప్పుకునేలా, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు వాడవాడలా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్, భీమిలి నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొర్రయి తేజ ఆశిష్, మండల ఐ టీడీపీ కో - ఆర్డనేటర్ సారికి విజయ్ తదితరులు పాల్గొన్నారు.