తమ అభిమాన హీరో రామ్ పై కొండంత అభిమానం :


సింహాచలం : సినిమా హీరోల పై అభిమానులు ఒక్కో రకంగా తమ ప్రేమను  వెలిబుచ్చుతారు. కొంత మంది తమకు నచ్చిన హీరో, హీరోయిన్ల పేర్లను టాటూ వేయించుకుంటారు. మరికొందరు తమ అభిమాన హీరో పేరిట సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ప్రేమను చూపిస్తారు. ఇక దువ్వుపాలెం గ్రామానికి చెందిన యర్ర రమేష్ తన అభిమాన హీరో పోతినేని రామ్ నటించిన సినిమా ది వారియర్ విజయవంతం కావాలని ఆయన సినిమా బ్యానర్ పట్టుకొని సింహాచలం గిరి ప్రదక్షణ చేసి ఆయన పై ఉన్న కొండంత అభిమానాన్ని చాటుకున్నాడు.

 ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఈ నెల 14న విడుదల కాబోతున్న ది వారియర్ చిత్రం విజయవంతం కావాలని, ఆయన ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని, మరెన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించాలని అన్నారు. అనంతరం సింహాచలం తొలిపాంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ అభిమానులు జి.బెనర్జీ, వి. దేవా, వి.వంశీ, ఈ.వరుణ్, వి.హరిని, జ్యోతి, యర్ర జగదీష్ తదితరులు పాల్గొన్నారు.