విద్యార్థి దశ నుండే క్రీడలకు నాంది పలకాలి…!

జనసేవ న్యూస్ భీమునిపట్నం:

విద్యార్థి దశ నుండే క్రీడలకు నాంది పలకాలి…! – జాతీయ పవర్ లిప్టింగ్ సిల్వర్ మెడలిస్ట్, తెలుగుదేశం నేత గంటా నూకరాజు

మానసిక ఉల్లాసానికి, ఆత్మ స్థైర్యం వృద్ధికి క్రీడలు మానవ జీవితంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ పవర్ లిప్టింగ్ సిల్వర్ మెడలిస్ట్ గంటా నూకరాజు అన్నారు.

రెమో లయన్స్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ పీతల రెమో యాదవ్ కు ఘనంగా సత్కరం

గత నెలలో యలమంచిలిలో జరిగిన రాష్ట్ర స్థాయి, సౌత్ ఇండియా స్థాయి టోర్నమెంట్ కరాటే పోటీలకు భీమిలి నుండి రెమో లయన్స్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. మాస్టర్ పీతల రెమో యాదవ్ ఆధ్వర్యంలో శిక్షకులు పి. రమణ, కె. రాంబాబు సమక్షంలో విద్యార్థులు యలమంచిలిలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొని వివిధ విభాగాల్లో పతకాలను సంపాదించారు.

రాష్ట్ర స్థాయి పోటీల్లో 10 స్వర్ణాలు, 7 సిల్వర్ మరియు 12 బ్రౌంజ్ మెడల్స్ పొందారని, అదేవిదంగా సౌత్ ఇండియా స్థాయిలో 13 స్వర్ణాలు, 12 సిల్వర్ మరియు 1బ్రౌంజ్ మెడల్స్ పొందారని నిర్వాహకులు తెలియజేసారు. వీరందరికీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బాక్షర్, జాతీయ పవర్ లిప్టింగ్ సిల్వర్ మెడలిస్ట్ గంటా నూకరాజు చేతులమీదుగా పతకాలను అందించడం జరిగింది. ఈ సందర్బంగా గంటా నూకరాజు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడమే కాకుండా మనిషి దృఢ సంకల్పానికి నాంది పలుకుతాయని అన్నారు. విద్యార్థి దశ నుండే పిల్లలకు వారికి ఏ క్రీడలు అంటే ఇష్టమో తల్లిదండ్రులు గుర్తించి ఆ రంగంలో నిష్ణాతులైన శిక్షకులచేత శిక్షణ ఇప్పించినట్లయితే బాగుంటుందని అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే కాకుండా లక్ష్యం వైపు అడుగులు వేసేవిధంగా క్రీడలు సహకరిస్తాయని అన్నారు. ఈ సందర్బంగా రెమో లయన్స్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ పీతల రెమో యాదవ్ మరియు శిక్షకులను, విద్యార్థుల తల్లిదండ్రులను మరియు పతకాలు పొంది భీమిలికే వన్నెతెచ్చిన పతకాల వీరులందరిని పేరుపేరున గంటా నూకరాజు అభినందించడమైనది.

వాలిబాల్ ప్లేయర్ బోర శ్రీను మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఎంతోమంది పిల్లలకు శిక్షణ ఇవ్వడమే కాకుండా పతకాలవేటలో భీమిలికి మంచి పేరుప్రతిష్టలు తెస్తున్నారని వారందరికీ నాయొక్క అభినందనలు అని చెప్పారు. ఈ సందర్బంగా మాస్టర్ పీతల రెమో యాదవ్ ను అసోసియేషన్ సభ్యులందరూ ఘనంగా సత్కరించడం జరిగింది.

భీమునిపట్నం రిపోర్టర్ పి శ్రీనివాసరావు

జనసేవ న్యూస్

https://ift.tt/62jpulJ Sports, జాతీయ వార్తలు, లోకల్, వార్తలు, ap, Bheemili, janasena, MARTIAL ARTS, SPORTS, TDP, ysrcp https://ift.tt/Ui6CHt1