జూ. ఎన్టీఆర్ జన్మదిన పోస్టర్ ను ఆవిష్కరించిన అభిమానులు :


 ఆనందపురం: ఈ నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 నగరాల్లో అభిమానులు అందరూ ముందస్తుగా జన్మదిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం తరపున మండలం లోని నీళ్ళకుండీలు జంక్షన్ లో టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన జన్మదిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ విశాఖపట్నం జిల్లా కో - ఆర్డినేటర్ లెంక సురేష్ మాట్లాడుతూ దేశంలో ఏ హీరో కు కూడా అభిమానులచే జన్మదిన పోస్టర్  ఆవిష్కరణ జరగలేదు అని, అది ఒక ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే సాధ్యమని, ఇది ఒక అదృష్టం గా భావిస్తున్నామని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ఇలాగే మంచి సినిమాలు తీస్తూ సినీ ప్రేక్షకుల ఆధర, అభిమానాలు పొందాలని అన్నారు. పుట్టినరోజు నాడు టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తామని, వీటిలో అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 
అనంతరం అభిమానులు అందరూ కేక్ కట్ చేసి , ఎన్టీఆర్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి పృద్విరాజ్, కోరుకొండ రమేష్, బూర్లు శ్రీను, పక్కుర్తి అప్పలనాయుడు, పడాల భాస్కర్ రావు, గండ్రేడ్డి భారత్, తోనంగి అప్పారావు, పాండ్రంకి శ్రీను, నాగిశెట్టి సురేంద్ర, కోరుకొండ భాను, నితిన్, కోరుకొండ శ్రీను, యర్ర రాజు, చందు, కురుముజు సంతోష్, బొద్దపు మోహన్, పిల్లా సంతోష్, సి.హెచ్.రమణ, కోరుకొండ రామారావు, సుమ్మ కనకరాజు తదితరులు పాల్గొన్నారు.