అక్షయ పాత్ర సేవలు భేష్...!

అక్షయ పాత్ర  సేవలు భేష్...!

ఆనందపురం: జనసేవ న్యూస్ 

 మండలంలోని రామవరం పంచాయతీలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు. 

గంభీరం లోగల ఈ సంస్థ కరోనా కాలంలో విశిష్ట సేవలందించి అందరి మన్ననలు పొందింది. బలవర్ధకమైన ఆహారం తో పాటు రోగుల స్థితిగతులపై అంచనా వేసింది. రామవరం లో గల మేముసైతం సొసైటీ ద్వారా ప్రజలకు భరోసా కల్పిస్తుంది.



 ఈ కార్యక్రమంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆపరేషన్ హెడ్ అంబరీష భక్త దాస ఇంటెక్ నాయకుడు కాకర్లపూడి వరహాలరాజు, శ్రీకాంత్ రాజు, ముఖన్ మాల్యా , తదితరులు పాల్గొన్నారు. దీనికి సంధానకర్తగా వేములవలస  సాయి రేఖ ఫోటో స్టూడియో యజమాని మూర్తి వ్యవహరించారు.

-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )