విజయనగరం :జనసేవ న్యూస్
స్థానిక అమర్ భవన్లో అశేష కార్మిక జనం మధ్య సిపిఐ పార్టి రాష్ట్ర,జిల్లా కార్యవర్గం మరియు కార్మికులు అమర జీవులకు సంతాప సభ నిర్వహించారు.
ఈ మధ్యకాలంలో ఆకస్మిక మరణానికి గురైన అమరజివులు కామ్రేడ్ కృష్ణంరాజు, కామ్రేడ్ ఆళ్తి అప్పలనాయుడు మరియు బి.వి రమణలకు ఘన నివాళులర్పించారు.
సిపిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె. రవీంద్రనాథ్ కృష్ణంరాజు కోసం మాట్లాడుతూ..
ఆయన 50 సంవత్సరాల పార్టీకి చేసిన సేవలు,కార్మికుల కోసం చేసిన పోరాటాలు మరువలేమని కృష్ణంరాజు అద్భుతమై నాయకుడుగా కొనియాడారు.
సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యుడిగా చేరి, ఒక ఉద్యోగిగా కొనసాగుతూ,cpi ఆదర్శ ప్రాయ నాయకుడిగా ఎదిగారు కామ్రేడ్ కృష్ణంరాజు.
1991-93, రాష్ట్ర కార్యదర్శిగా తరువాత కొంతకాలం జాతీయ నాయకులు గా సిపిఐ పార్టీలో పని చేశారు.
తాను నమ్మిన సిపిఐ పార్టీ సిద్ధాంతాలకే ఆయన గౌరవం ఇచ్చారని పార్టీ నాయకులు తెలిపారు. , బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీ, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ, 104,108, చేనేత కార్మికుల హక్కుల కోసం పోరాటంలో ప్రధాన వ్యక్తిగా అలుపెరుగని పోరాటం చేశారు.
ఏ ఐ టి యు, సి ఐ టి యు సి, పి.ఎసి.ఎస్. కోపరేటివ్ సెక్టార్లో అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్మికులకు పే స్కేల్ కోసం కార్మికుల కోసం అయన చేసిన సేవలు కార్మికుల మరవలెరని జిల్లా నాయకులు తెలిపారు.
ఈ సంతాప సభలో అశేష కార్మిక వర్గం,అమర జీవుల కుటుంబ సభ్యులు వాడపల్లి శ్రీనివాసరాజు, రంగరాజు, పర్వాన,అల్తిలక్ష్మి మరియు జిల్లాప్రధాన కార్యదర్శి. ఒమ్మిరమన, జిల్లా పార్టీ సభ్యులు,
కామేశ్వరరావు, కె.రామకృష్ణ, జెల్లి విల్సన్, భగత్, అశోక్, కె.నారాయణ రావు మిడ్ డే మీల్. లక్ష్మి. తదితరులు పాల్గొన్నారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )