ఆనందపురం :జనసేవ న్యూస్
అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సత్వర న్యాయం చేయడం పట్ల ఆ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వేములవలస జంక్షన్ లో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసే కార్యక్రమం చేపడుతున్నట్లు వైకాపా మండల అధ్యక్షుడు బంక సత్యం తెలిపారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు, వైకాపా నాయకులు అందరూ విరివిగా హాజరు కావాలని కోరారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )