*ఆనందపురం* : మండల పరిధిలో గల సొంట్యం గ్రామ పంచాయతీ లో తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలతోనే బిడ్డలకు ఆరోగ్యం అని, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఆరు నెలలు వచ్చే పిల్లల వరకు తల్లిపాలే మంచిదన్న విషయాన్ని బాలింతలకు తెలియజేసారు. తల్లిపాల ప్రాముఖ్యతను అంగన్వాడీ పరిధిలోని గర్భిణీలకు,
బాలింతలకు అవగాహన కల్పించారు. అనంతరం పాలు ప్యాకెట్లు, గుడ్లు మరియు ఇతర అంగన్వాడీ సామాగ్రి లతో తయారు చేసిన చిహ్నాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సొంట్యం అంగన్వాడీ కార్యకర్తలు కె. రామలక్ష్మి, జీ. పుష్ప మరియు పంచాయతీ లో గల వివిధ గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, సచివాలయ మహిళ పోలీస్, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.