రామభద్రపురం: జనసేవ న్యూస్
స్థానిక మండల కేంద్రం పొట్టవాని కోనేరు ఆవరణలో వార్డు మెంబర్ పెద్దపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో శనివారం ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టాపన ఘనంగా జరిగింది.
ఉదయం హోమం, పలువురు దంపతులచే ప్రత్యేక పూజలు జరిపించి ప్రసాద వితరణ చేశారు. అలాగే పక్కనే గల సుబ్రమణ్య స్వామి ఆలయంలో కూడా పూజలు జరిపారు. దాతల సహకారంతో ఇక్కడ విశ్రాంతి గాను భక్తులకు సదుపాయాలు కల్పించారు.
జి. రవి కిషోర్ ( బ్యూరో చీఫ్ )