రైల్వేన్యూ కాలనీ : జనసేవ న్యూస్
రైల్వే న్యూ కాలనీ పరిధిలోని శ్రీ కన్య థియేటర్ వద్ద గల స్క్వాడ్ ఫిట్నెస్ జిమ్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది.
యువకులు ఎవరికి వారే స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఏ.ఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తనమూనాలను సేకరించారు.
జిమ్ నిర్వాహకులు ఆకిరెడ్డి జగదీష్,భాషా, టీవీ రమణ, బి.శివ కుమార్ లతోపాటు స్వచ్ఛంద సేవకుడు శేఖర్ మహంతి వరప్రసాద్ శిబిరంలో సహాయ సహకారాలు అందించారు.