రాష్ట్ర ప్రభుత్వం APSRTC చార్జీలను అడ్డూ అదుపులేకుండా పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపినందుకు నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించబడును

*****************************************

             

                         *పెంచిన ఆర్టీసీ ఛార్జీలపై*

                              *నిరసన ర్యాలీ



              తేది: 15-04-2022 శుక్రవారం ఉదయం గం. 9-30ని.లకు తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగును.

             రాష్ట్ర ప్రభుత్వం APSRTC చార్జీలను అడ్డూ అదుపులేకుండా పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపినందుకు నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించబడును.

       భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి గంటస్థంభం వద్దకు ర్యాలీ నిర్వహించి మానవహారం ద్వారా నిరసన తెలియజేయబడును.

            పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతే ద్యేయంగా తెలుగుదేశం పార్టీ నిర్విరామంగా పనిచేస్తుంది. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడుతుంది. నాటి నుండి నేటివరకు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో దీక్షలు , మరెన్నో నిరసనలు. ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రజా శ్రేయస్సు కొరకే. నేడు వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలనెత్తిన పెనుభారం పెడుతుంది. అందుకే మరలా మీ కోసం, మీ శ్రేయస్సు కోసం ఈ నిరసన.
 
     రండి.. కదలి రండి..

ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఈ నిరసన చేపడదాం.

          ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతున్నాను.

         మీ

గంటా నూకరాజు,
     కార్యదర్శి,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ,
టెక్కలి నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు.