శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం అష్టమి తిథిన కృష్ణుడు అవతరించాడు. రోహిణి నక్ష్తత్రం లగ్నమందు అర్ధరాత్రి సమయాన దేవకి-వసుదేవుడు దంపతులకు జన్మించాడు. ఈ రోజు వేకువ జామున నిద్ర లేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. తలంటి స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. మధ్యాహ్నం 12 గంటలకు మాధవుడి పూజ ప్రారంభించడం మంచిది.
భగవద్గీత.. హిందువుల పవిత్ర గ్రంథమే కాదు సకల ధర్మాలు అందులో ఉంటాయి. ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు ఇందులో సమాధానముంటుంది. ఇంతటి మహోత్తరమైన గ్రంథాన్ని మనకు అందించిన శ్రీ కృష్ణుడు జన్మదినం ఈ రోజు. అష్టమిలో పుట్టిన ఈ చిన్ని కృష్ణుడు తన లీలలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆయుధం పట్టకుండానే వెనకుండి కురక్షేత్రాన్ని నడిపించిన మహా యోధుడు. అంతటి మహత్తరమైన వ్యక్తి శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథిలో రోహిణి నక్షత్ర లగ్నమందు జన్మించాడు. ఈ నేపథ్యంలో కృష్ణ జన్మాష్టమి తిథి, ముహూర్తం, సమయం లాంటి విషయాలతో పాటు ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి, కృష్ణాష్టమి ప్రత్యేకత ఏంటి లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉట్టి సంబరాలు