తాటితూరు ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని పి.యస్ యస్ లక్ష్మీకి డాక్టరేట్ తో పాటు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్

పత్రికా ప్రచురణార్థం

తాటితూరు ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని పి.యస్ యస్ లక్ష్మీకి బెంగుళూరుకు చెందిన భారత్ వర్చువల్ యూనివర్సిటీ పీస్ అండ్ ఎడ్యుకేషన్ వారు సాహిత్యరంగం లో చేసిన సేవలకుగాను డాక్టరేట్ తో పాటు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్ ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించు కొని పాఠశాల తరుపున ప్రధానోపాధ్యాయులు డొకర శ్రీనివాస్ గారు 
 ,ఉపాధ్యాయులు మరియు పండిత పరిషత్ తరుపున రాష్ట్ర అదనపు కార్యదర్శి టి.ఎస్.వి. ప్రసాద్ గారు, తెలుగు శ్రీనివాసు గారు ఘనంగా సన్మానించారు.గతంలో లక్ష్మీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ,జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ,రాష్ట్ర కళానిధి,గురుబ్రహ్మ,నంది నాటకోత్సవ,

ఆట అవార్డ్,ఉత్తమ కధా రచన,ఉత్తమ కవిత, ఉత్తమ నటి,ఉత్తమ జానపద గేయ రచన,మదర్ థెరీసా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్, అమరావతి ఉగాది పురష్కారం ,విజయనగరం మహరాజా లేడిస్ క్లబ్ నుండి ఉత్తమ నటి,కవియిత్రి,ఉత్తమ డైరెక్టర్ మరియుఅనేక మండల,జిల్లా మరియు రాష్ట్రస్ధాయి అవార్డులను విద్యా,సాంస్కృతిక ,సేవా కార్యక్రమంలో అవార్డ్స్ అందుకోవడం జరిగింది.