తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకుడిని పరామర్శించిన కోరాడ యువసేన నాయకులు
ఆనందపురం: జనసేవ న్యూస్
జాబ్ క్యాలెండర్ పై పోరాటంలో భాగంగా ఛలో తాడేపల్లి కార్యక్రమానికి హాజరవుతున్నారనే సమాచారంతో ముందస్తు అరెస్టు చేయబడిన టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లెంక సురేష్ కు మద్దతు గా కోరాడ యువసేన నాయకులు పరామర్శించారు.
ఈ సందర్భంగా కోరాడ యువసేన నాయకుడు, ఆనందపురం పది వ వార్డు మెంబర్ సారికి విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ రాజబాబు ఆదేశాల మేరకు స్టేషన్ కు వెళ్లి పరామర్శించమని అన్నారు.
ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకొని ముందస్తు అరెస్టులను చేస్తుందని, ముందస్తు అరెస్టులతో విద్యార్థి, యువత భయపడేది లేదు అని ఎద్దేవా చేశారు.
పార్టీ ని నమ్ముకున్న వారికి, న్యాయం కోసం పోరాడే వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కోరాడ యువసేన సభ్యులు గొర్లె సంతోష్, కొర్రయ తేజ తదితరులు పాల్గొన్నారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )