ఆనందపురం:జయ జయ హే
కబ్జాదారులు నుండి మా భూమిని కాపాడి తగిన న్యాయం చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆనందపురం గ్రామానికి చెందిన సుంకరి అప్పల రాములమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
మండలంలోని బా కుర పాలెం సర్వే నెంబర్ 6/11లో 16 సెంట్లు భూమి ని 2004 సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగిందని అప్పటినుండి ఈ భూమి మా అనుభవం లోనే ఉందని నేటి వరకు ఫల సాయాన్ని పొందుతున్నామని ఆమె వివరించారు.
ఈనెల 24న బాకురపాలెం గ్రామానికి చెందిన పలువురు మా భూమి లోకి చొరబడి ఆక్రమణకు పాల్పడగా అడ్డుకున్న తమపై దాడి కి పాల్పడినట్లు ఆమె తెలియజేశారు.
కాబట్టి నాకు మా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించి మాకు తగు న్యాయం చేయాలని ఉన్నతాధికారులు కలిసి ఫిర్యాదు చేసినట్లు సుంకరి అప్పల రాములమ్మ వివరించారు.
ఈ సందర్భంలో ప్రజా సంక్షేమ సంఘం నాయకుడు మీసాల అప్పలనాయుడు భీమిలి లో మంత్రి అవంతి శ్రీనివాస్‌రావును కలుసుకొని భూ వివాదం పై వివరించి ఫిర్యాదు చేసారు.
అనంతరం మంత్రి అవంతి స్పందించి ఈ కబ్జాపై పూర్తి వివరాలు తెలుసుకుని సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.