అంతర్జాతీయ స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో వెండి పతకం :


 ఆనందపురం : అంతర్జాతీయ స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో భారతదేశం తరుపున వివిధ విభాగాల్లో పాల్గొన్న మన జిల్లా క్రీడకారులు అద్భుత ప్రదర్శన కనబరిచి వివిధ పతకలు సాధించినట్లు స్కై మార్షల్ ఆర్ట్స్ కోచ్ లెంక అప్పలరాము తెలిపారు. 

ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు నేపాల్ లో జరిగిన 7వ సౌత్ ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మిందివానిపాలెం గ్రామానికి చెందిన నాగిశెట్టి జ్ఞానవర్థన్ అండర్ - 14 విభాగం లో ప్రతిభ చూపి సిల్వర్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా స్కై ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ నజీర్ అహ్మద్ తో పాటు జిల్లా స్కై అధ్యక్షులు ఆబోతు అప్పలరాము, బి. బంగారాజు, జి.రవి, ఆర్.శ్రీను, ఎస్. అప్పారావు, ధనుష్, బి.సంతోష్, కాకర సురేష్, ఎ. దేముడు బాబు తదతరులు అభినందించారు.