విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దనే నినాదంతో 'పల్లా' పాదయాత్ర కు పాశర్ల సంఘీభావం
ఆనందపురం :జనసేవ న్యూస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దనే నినాదంతో విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేస్తున్న పాదయాత్రకు టిడిపి విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ సంఘీభావం తెలిపారు. పెందుర్తి మండలం నడుపు లో ఆయనను కలుసుకుని మద్దతు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాశర్ల హెచ్చరించారు.
(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )
ఈ పోస్ట్ ని మే ప్రియమైన వారి అందరికీ పాంపించండి.