కాంస్య పోరులో అదరగొట్టిన సింధు.. భారత్‌కు మరో పతకం

కాంస్య పోరులో అదరగొట్టిన సింధు.. భారత్‌కు మరో పతకం

టోక్యో: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డుకెక్కింది. కోట్లాది మంది భారతీయులు కోరుకున్నట్టే ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించింది. కాంస్య పతకం కోసం కొద్దిసేపటి క్రితం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హే బింగ్‌జియావో (చైనా)తో జరిగిన పోరులో వరుస సెట్లలో విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా  రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ తర్వాత వ్యక్తిగతంగా రెండు ఒలింపిక్‌ మెడల్స్‌ అందుకున్న అథ్లెట్‌గా రికార్డులకెక్కింది._


_నిన్న సెమీస్‌లో  వరల్డ్‌ నెంబర్‌ వన్‌ తై జు యింగ్‌ చేతిలో ఓడిన సింధు నేడు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఆడింది. పూర్తి ఎనర్జీతో, మంచి ఫుట్‌వర్క్‌తో కనిపించింది. చివరి వరకు అదే ఊపు కనిపించి రెండో సెట్‌ను కైవసం చేసుకున్న సింధు కాంస్యంతో మెరిసింది._