పార్లమెంటు లో కీలకమైన పబ్లిక్ అకౌంట్ కమిటీ సభ్యునిగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
విజయసాయిరెడ్డి తో పాటు మరో బిజెపి ఎంపీ సుధాంశు త్రివేది ఎన్నికయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ శర్మ తెలియజేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలించడంలో కీలకంగా వ్యవహరిస్తోంది.
Reporter
సురేశ్