విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
ఆనందపురం:జనసేవ న్యూస్ 
తగరపువలస పెట్రోల్ బంకు దగ్గర గల గాంధీ విగ్రానికి బిజెపి సీనియర్ నాయకులు పంపాను శ్రీధర్, గుజ్జు రాము, ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు, జండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగాయి.
 ఈ సందర్భంగా పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్, చైర్మన్, శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవ ట్రస్ట్, ప్రధాన కార్యదర్శి, కిసాన్ మోర్చా, విశాఖ పార్లమెంటు జిల్లా, సమకూర్చిన నోట్ పుస్తకాలు,పెన్ లు, విద్యార్థులకు పంపిణీ కార్యక్రమం బిజేపి నాయకులు, బిజేపి ఎస్సీ మోర్చా విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, కోడూరు సంజీవ్ రావు, బిజేపి,2 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి, గని వాడ పార్వతి, బిజెపి సీనియర్ నాయకులు, జిరు సత్యనారాయణ రెడ్డి, హాజరై పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, అప్పల నరసింహ రాజు, పి. సాయి రమేష్, గండి లక్ష్మీ రావు,పి. బాపుజీ, పాల్గొన్నారు.
-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )