కలెక్టర్ ను కలిసిన కోరాడ నవీన్

కలెక్టర్ ను కలిసిన కోరాడ నవీన్
ఆనందపురం :జనసేవ న్యూస్ 

 విశాఖ జిల్లా నూతన కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మల్లికార్జున్ ను ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 


పుష్ప గుచ్చం అందించి అతన్ని పరిచయం చేసుకున్నారు. తదనంతరం వారిద్దరూ స్థానిక సమస్యలపై భేటీ అయ్యారు. ప్రధానంగా వేములవలస ఫ్లైఓవర్ వంతెన దిగువన డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల గ్రామంలోకి వర్షం పడితే బురద నీరు చేరి ఇళ్లల్లోకి వస్తుందని కలెక్టర్ దృష్టికి కోరాడ నవీన్ తీసుకువెళ్లారు. 


ఇదే సమస్యపై ఇటీవల జెసి అరుణ బాబుకు కూడా వినతి పత్రం సమర్పించినట్లు కోరాడ నవీన్ నూతన కలెక్టర్ కు తెలిపారు. ఈ విషయంలో స్పందించిన కలెక్టర్ మల్లికార్జున రావు వెనువెంటనే నేషనల్ హైవే అథారిటీ పి.డి. తో మాట్లాడారు. 

ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఫార్సు చేశారు. కలెక్టర్ స్పందన పై వేములవలస ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్, నడిమింటి అప్పలరాజు ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )