ఆనందపురం:జనసేవ న్యూస్
వృక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యవరణాన్ని పరిరక్షణే.ధ్యేయం గా మట్టి వినాయకుల్ని విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది.
ఆనందపురం మండల అభివృద్ధి అధికారి అడప లవ రాజు మాట్లాడుతూ ప్రకృతితో సహజీవనం చేస్తూ ముందుకు సాగితేనే మానవ మనుగడకు సార్థకత ఉంటుందని, అందుకే మట్టి గణపతులనే ప్రతిష్టించాలని కోరారు.
వృక్ష ఫౌండేషన్ అధ్యక్షులు కాకర సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు పర్యవరణా పరిక్షించే విధంగా పండగలు జరుపుకోవాలని,అందరూ మట్టి వినాయకుల్ని పూజించాలని చెరువులో నదులో నీటి కాలుష్యం కాకుండా పర్యావరణాన్ని కోసం మట్టి వినాయకుణ్ని పూజించాలని అన్నారు.
ప్లాస్టర్ ఆఫ్ పారీస్తో వాతావరణ కాలుష్యం, నీటికాలుష్య సమస్యలు తలెత్తుతాయి.పర్యావరణపై అవగాహన పెంచేందుకే పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి పంపీణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెల్లంకి పంచాయతీ కార్యదర్శి జి ఏవి శ్రీరామ్ మూర్తి, సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు ,ఉప సర్పంచ్ కంచరపు శ్రీనివాసరావు ,ఫౌండేషన్ ప్రతినిధులు టి. జగదీష్ , సాడి శంకర్ ,సాడి పవన్,సాయీ రెడ్డి పాల్గొన్నారు.
(జి. రవి కిషోర్ )-బ్యూరో చీఫ్