వెంకటాపురం లో మహా అన్నదానం

ఆనందపురం:జనసేవ న్యూస్

మండలం లోని వెంకటాపురం గ్రామంలో వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని వేములవలస ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. 

 అతని తండ్రి భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కోరాడ నాగభూషణరావు అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించారు. షడ్రుచులతో కూడిన భోజనాన్ని అందరూ ఆస్వాదించారు.

 గ్రామంలో గల యువకులు కూడా పాల్గొని తమ వంతు సహకారం అందించారు. ఇందులో వెంకటాపురం నుండి శివ, రమణ, అప్పలస్వామి, మహేష్, గౌరినాయుడు లు సేవలందించారు. వేములవలస నుండి కోరాడ దామోదర్ రావు, నడిమింటి అప్పలరాజు, కోరాడ రమణ లు సహాయ సహకారాలు అందించారు. 

సుమారు 2000 మందికి పైగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కోరాడ నాగభూషణరావు అతని కుమారుడు కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ లకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.


-జి. రవి కిషోర్ (బ్యూరో చీఫ్ )