జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పణ

           విశాఖపట్నం జిల్లా

              ఓటీఎస్ ( one Time Settlement) తో సంబంధం లేకుండా పేదలకు ఉచితంగా ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలనే డిమాండ్ తో జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో    కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయుటకు  తేది: 27-12-2021 సోమవారం ఉదయం 10 గం.లకు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంనకు హాజరు  కావలసినదిగా కోరుతున్నాను.

          తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు, అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి పిలుపు మేరకు,  రాష్ట్ర అద్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు,  విశాఖ పార్లమెంట్ అద్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో  భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కోరాడ రాజబాబు గారి సూచనలు ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించబడును.

         కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు హోసింగ్ లబ్దిదారులు అధికసంఖ్యలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాను.

        మీ

గంటా నూకరాజు,
      కార్యదర్శి,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ,
భీమిలి డివిజన్ అద్యక్షులు.

Reporter
P. శ్రీనివాస్ రావు

*****************************************