*ఆనందపురం* : మండలంలోని మిండివానిపాలెం ప్రాథమిక పాఠశాలలో శ్రీమతి సావిత్రి బాయి పూలే గారి జయంతి ఉత్సవాన్ని టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సావిత్రి బాయి పూలె గారి ఫొటోకు పులామాల వేసి మహిళల విద్య అభివృద్ధి కోసం ఆవిడ చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు.
ఆ పాఠశాల మహిళ ఉపాధ్యాయిని శ్రీమతి యం. ప్రేమకుమారి గారిని శాలువా కప్పి , పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రి బాయిపులే దేశంలో మొట్టమొదటి మహిళ ఉపాద్యాయిని అని, ఇప్పుడు ఉన్న ప్రతి మహిళ ఉపాద్యాయినికి ఆవిడ ఆదర్శం అని అన్నారు.
అనంతరం తెలుగు నాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ మాట్లాడుతూ సావిత్రి బాయి పూలె గారి జయంతి రోజున ప్రతీ ఏటా మహిళ ఉపాద్యాయ దినోత్సవాన్నీ జరుపుకుంటారని, కులమత బేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అని అన్నారు.
తన భర్తతో కలసి 1848 సంవత్సరంలో పుణె లో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించి, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తన సామాజిక బాధ్యతగా స్వీకరించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లెంక అప్పలరాము, నాగిశెట్టి పృద్విరాజ్, గంట సాయికుమార్, బుర్లు శ్రీను గ్రామ యువకులు మరియు విద్యార్దులు పాల్గొన్నారు.