ఆనందపురం జనసేవ న్యూస్ :
మండలంలోని వేములవలస పూల మార్కెట్ లో స్థానిక ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ విస్తృతంగా పర్యటించారు.
కరోనా మూడవ దశ చాలా తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఆయన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
ముఖ్యంగా భౌతిక దూరం పాటించడమే కాకుండా ఎప్పటికప్పుడు శానిటైజర్ తో చేతులు పరిశుభ్రం చేసుకోవాలన్నారు. మార్కెట్కు వచ్చే వారంతా మాస్కులు తప్పనిసరిగా విధించాలన్నారు.
నిబంధనలు పాటించని వారికి ఎటువంటి సరుకులు ఇవ్వవద్దని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది.