కల్లి వాని పాలెం లో హత్యగొంతు కోసి చంపిన దుండగులు

ఆనందపురం:జనసేవ న్యూస్ 
           ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ కల్లివాని పాలెం కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట  సమయంలోఒక ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని గొంతు కోసి హత్య చేశారు. 
            అడ్డుకున్న తల్లిని నోట్లో గుడ్డలు పెట్టి  కుమారుడుని హత్య చేశారు. వివరాలు కళ్లి వాని పాలెం కాలనీకి చెందిన పిల్లి పైడి రెడ్డి(46) (నేత్ర)మంగళవారం అర్ధరాత్రి ఈ సమయంలో కొంతమంది వచ్చి ఇంట్లోకి చేరి  పైడి రెడ్డిని (నేత్ర)ని గొంతు కోసి హత్య చేశారు విషయం

 తెలుసుకున్న పోలీసులు సీఐ వై రవి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు మృతుడి భార్య కొండమ్మ ఆశా వర్కర్ గా పని చేస్తున్నారు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు మృతికి గల కారణాలు పోలీసులు విచారణ చేపడుతున్నారు

జి జి  రవి కిషోర్ బ్యూరో చీఫ్