భూమిపై ఉన్న ప్రతి జీవి మనుగడకు నీరు చాలా ముఖ్యం. అయితే దాహంతో చచ్చిపోవాల్సి వచ్చినా నదిలో లేదా చెరువు నీరు తాగని పక్షి ఈ భూమిపై ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఈ పక్షికి గిన్నెలో నీళ్లు ఇచ్చినా అది వాటిని తాగదు. నిజానికి మనం చెప్పుకుంటున్న ఈ పక్షి వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది. ఈ పక్షి ఏ సరస్సు, చెరువు లేదా నది నుండి నీరు తాగదు. వర్షం పడినప్పుడు మాత్రమే ఈ పక్షి దాహం తీర్చుకుంటుంది.
దీనిని చాతక పక్షి అంటారు. ఈ పక్షి చాలా దాహం వేసినప్పటికీ వర్షం నీటిని మాత్రమే తాగుతుంది. పైగా అది నీరు తాగడానికి దాని ముక్కు తెరవదు.
ఈ విషయంలో ఈ పక్షికి కాస్త ఆత్మగౌరవం ఎక్కువేనని వ్యాఖ్యానిస్తుంటారు. ఈ చాతక పక్షి ఆసియా, ఆఫ్రికా ఖండాలలో మాత్రమే కనిపిస్తుంది. చాతక పక్షి భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రధానంగా కనిపిస్తుంది.
ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌లో దీనిని చోళీ అని పిలుస్తారు. గర్వాల్ ప్రజల అభిప్రాయం ప్రకారం ఈ పక్షి ఎక్కువ సమయం ఆకాశం వైపు తన చూపులను ఉంచుతుంది.
అది స్వాతి నక్షత్రంలో కురిసే నీటిని మాత్రమే తాగుతుంది. మార్వాడీలో చాతక పక్షిని పక్షిని మఘ్వా లేదా పాపియా అని కూడా పిలుస్తారు.