జనసేవ న్యూస్ :అనకాపల్లి
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జి పరుచూరి భాస్కరరావు గారు అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం లో గల సుమారు 26 పంచాయతీలకు గ్రామ కమిటీలు నియమించి 460మంది జనసైనికులకు నియమాక పత్రాలు అందజేసారు.
ఈ సందర్భంగా హాజరైన జనసైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మార్చి నెల నుండి కసింకోట మండలంలోని ప్రతి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టనునట్లు తెలియజేసారు, అలాగే త్వరలో నియోజకవర్గంలో చేపట్టబోయే గ్రామ స్థాయి పర్యటనలు కి జనసైనికులు అందరూ సన్నద్ధం అవ్వాలని కోరారు.
భోజన విరామం అనంతరం ప్రతి గ్రామ కమిటీ సభ్యులతో ప్రత్యేకం గా సమావేశమయ్యి త్వరలో చేపట్టబోయే మండల కమిటీకి సంబందించి వారి నుండి తగు సూచనలు తీస్కున్నారు.
ఈకార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.