కాశ్మీర్ పై ల్స్ నుమించిన ఆంధ్ర ఫైల్స్ సినిమా తీయాలి ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా.శ్రీనివాస్


-------------కాశ్మీర్ ఫైల్స్ ను మించిన ఆంధ్ర ఫైల్స్ సినిమా తీయాలి. 
విభజన ద్రోహంలో జరిగిన అరాచకాన్ని చూపాలి. 
ఆనాటి ఆంధ్రుల త్యాగాలు నేటి సమాజానికి తెలపాలి. 
జై ఆంధ్ర ఉద్యమం పై ఆ నాటి కేంద్ర ప్రభుత్వం చిమ్మిన విషం ఆంధ్రులకు తెలియచేయాలి. 
పొట్టి శ్రీరాములు మరణ ఘటనపై నిజాలను ఆంధ్రులకు తెలపాలి. మేడా శ్రీనివాస్, కోరారు, 
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ 
మోది జాతీయ ద్రోహి, కేసీఆర్ ప్రాంతీయ ద్రోహి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయిన అనంతరం  ఆంధ్రప్రదేశ్ కు జరిగిన, జరుగుతున్న అన్యాయం భారతదేశంలో 
ఏ రాష్ట్రానికి జరగలేదని, బళ్ళారి, తంజావూరు నుండి ప్రస్తుత  కర్ణాటక, తమిళనాడు లోగల కొంతభాగం అఖండ ఆంధ్రప్రదేశ్ గా వుండేదని, రాజకీయ ఆధిపత్య పోరుకు, కొంతమంది సంకుచిత నేతల కారణంగా ఆంధ్రప్రదేశ్ ముక్కలుగా చిక్కి పోయిందని,ఆనాడు ఆంధ్రుల మేధస్సు, శ్రమ తో ఆ నాటి చెన్నపట్నం (మద్రాస్)నేడు మహా నగరంగా ప్రశిద్ది చెందింది అంటే ఆంధ్రులు కృషి  కాదా ! చరిత్ర తెలిసిన వారు కాదనగలరా అని, అనివార్యంగా విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ కు స్వయం ప్రతిప్రత్తి దక్కి ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడిందని, ఆంధ్రుల శక్తి యుక్తుల కోసం తెలిసిన ఆనాటి ఢిల్లీ  కాంగ్రెస్ పెద్దలు కుట్ర తో ఉమ్మడి రాష్ట్రాల ఏకాభిప్రాయంగా  హైదరాబాద్ శాసనసభలో మెజార్టీ తీర్మానం పొంది ఆంధ్రప్రదేశ్ విలీనం జరిపారని,  హైదరాబాద్ ను రాజధాని గా ప్రకటించి నమ్మించారని, ఆనాడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కుట్రతో  
ఆ తీర్మానమే జరిగి వుండకపోయి వుంటే నేడు ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణా రాష్ట్రాలు ఎంతగానో అభివృద్ధి చెందేవని, ఆనాటి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కుట్ర నేడు కేసీఆర్ విష బీజాలకు రాజకీయంగా కలిసొచ్చాయని,  తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదాలు సృష్టిస్తు అగ్గి రాజేస్తు కేసీఆర్, మోది లు మిఠాయిలు తింటున్నారని,
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రజల భవిష్యత్ పై  మట్టి కొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు కు  విభజన అనివార్యం ఆయినప్పటికీ ఉద్యమం ముసుగులో అరాచకం సృష్టించి కొన్ని లోపాయికార ఒప్పందాలతో  కేసీఆర్, ఆంధ్ర నాయకులు రాజకీయ లభ్ది పొందారని, రెండు రాష్ట్రాల పాలకులు అభివృద్ధిని  దోచుకుంటున్నారని,ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో స్వచ్ఛమైన విభజన ఉద్యమ కారులకు దక్కాల్సిన గుర్తింపు దక్కక పొగ తెలంగాణా అమరవీరుల ప్రాణత్యాగాలపై  కేసీఆర్ విషం కక్కి వారి త్యాగాలను కేసీఆర్ కు అనుకూలంగా మలుచుకున్నారని, విభజన ఉద్యమం లో ద్రోహం, అరాచకం తప్ప త్యాగాలకు గుర్తింపు లభించలేదని, ఉద్యమ కారులతో  కూడిన చరిత్ర  
కేసీఆర్ కు లేదని,రాష్ట్ర విభజన అనంతరం కూడా ప్రజల మధ్య అగ్గి రేజేసే కుట్రలు కుతంత్రాలు కేసీఆర్  చేస్తూనే వున్నారని , అభివృద్ధి, సంక్షేమం పై పాలకులు ద్రుష్టి సాధించక పోవటం ప్రజల దురదృష్టం అని,విభజన అరాచక చరిత్ర  నేటి పాలకులు ప్రజలకు తెలియనీయటం లేదని, విభజన అనివార్యం అయినప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన, రావాల్సిన వి అడగటంలో నేతల అసమర్ధతను చాటుకుని సొంత లాభాలు ఆర్జించారని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు. 
1972 ఉవ్వెత్తున ఉద్బవించింన 
జై ఆంధ్ర  ఉద్యమాన్ని కుట్రలు కుతంత్రాలతో ఆనాటి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అణచివేసే చర్యలతో సుమారు 400 మంది పైబడి ఉద్యమ కారులను కాల్చి చంపారని, ప్రత్యేక రాష్ట్రం కై 
జై ఆంధ్ర అంటు ఉద్యమించిన వారిని అన్యాయంగా చంపి నేడు అశాస్త్రీయమైన విభజన తో ఆంధ్రప్రదేశ్ ను విభజించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ని ఉరి తీయాలా  ! అని, ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధి దక్కుతుంది అంటే ఢిల్లీ పెద్దలకు పంచెలు తడుస్తాయని, అందుకే తెలుగు రాష్ట్రాల మధ్య నిరంతరం అగ్గి రాజేస్తున్నారని, రెండు తెలుగు రాష్ట్రాల్లో వున్న రాజకీయ దళారులతో ఢిల్లీ పె(గె )ద్దలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ని దోచుకుంటున్నారని, అనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం తెన్నిటి విశ్వనాధం, కాకాని వెంకటరత్నం, గౌతు లచ్చన్న వంటి నిజాయితీ పరుల ఆధ్వర్యంలో స్వాతంత్ర పోరాట ఉద్యామాన్ని మించిన ఉద్యమం జై ఆంధ్ర ఉద్యమంగా  సాగిందని, ఆనాడే ప్రత్యేక ఆంధ్ర ప్రకటించి ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అతిగొప్ప సంపన్న రాష్ట్రంగా వుండేదని ఆయన తీవ్ర ఆవేదన చెందారు .
ఆ నాడు చెన్నపట్నం (మద్రాస్)నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన పొట్టి శ్రీరాములు వారిని కూడా రాజగోపాలాచారి ద్వారా జవహర్ లాల్ నెహ్రూ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలు సాగించారని, ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం చేపట్టిన పొట్టి శ్రీరాములు వారు చేపట్టిన  ఆమరణ నిరాహార దీక్ష ను కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్య పెట్టకుండా ఢిల్లీ కి తప్పుడు సంకేతాలు పంపేవారని, రాష్ట్రం కోసం ఆ మహా నేత పొట్టి శ్రీరాములు గారు అవిశ్రాంత నిరాహార దీక్ష కొనసాగించడంలో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షిణించి మరణించారని, ఆయన పార్థివ దేహాన్ని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన తరుణంలో తీవ్రమైన దుర్గంధం తో ఆయన నోటినుండి క్రిమి కీటకాలు వెలువడుతున్న తరుణంలో ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చొరవతో పదుల సంఖ్యలో హాజరయ్యారని,
అనంతరం ఈ వార్త తెలిసిన వెనువెంటనే టంగుటూరు ప్రకాశం పంతులు వారు హుటాహుటిన హాజరై ఆ మహానేత మరణం పై ఆవేశంగా ప్రసంగించిన పిదప ఆంధ్రుల్లో తిరుగుబాటు వచ్చి రాష్ట్ర మంతా  శాంతి భద్రతల సమస్య ఏర్పడిన పిదప ఢిల్లీ పెద్దలు కళ్ళు తెరిచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గా ప్రకటించారని, ఆలా ఆ మహా నేత పొట్టి శ్రీరాములు వారు  కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల నిర్లక్ష్యానికి మరణించారని,
ఆ నాటి ఢిల్లీ  కాంగ్రెస్ పెద్దలుకు తెలుగు వారంటే కిట్టదని, అందుకే తెలుగువారైన    గొప్ప వారు మేధావులు, ఉద్యమ వీరులు మాజీ ప్రధాని పి వి నరసింహారావు, పొట్టి శ్రీరాములు వారిని మరణించిన తరువాత కూడా  వారిపై కక్ష తీర్చుకున్నారని  ఆయన గుర్తు చేసారు.
ఆనాటి జాతీయ కాంగ్రెస్  పార్టీ నుండి నేటి బిజెపి (మోది) పార్టి వరకు తెలుగు రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూనే వున్నాయని, మోది తో దేశ భద్రతకు, సంక్షేమానికి, సమగ్రతకు, సార్వ బౌమాది కారానికి పెను ప్రమాదం వుందని , తెలంగాణా  రాష్ట్రం కు కేసీఆర్  నాయకత్వం అత్యంత ప్రమాదం అని,ఆంధ్ర పాలకులు, నేతలు సైతం కేసీఆర్ కు  భయపడుతు ఆస్తులు, వ్యాపారాలు కాపాడుకుంటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను కాల రాస్తున్నారని ఆయన మనస్తాపం చెందారు. 
ఆనాడు మద్రాస్ ను, నేడు హైదరాబాద్ ను అభివృద్ధి పరిచిన ఆంధ్రుడుకు నేడు రాజధాని లేకుండా నడిరోడ్డుపై వున్నాడని,కాశ్మీర్ ఫైల్స్ లో చూపిన దారుణాలకు 100 రెట్లు ఆంధ్రులకు అన్యాయం జరిగిందని, ఆంధ్రులకు జరిగిన ద్రోహం అన్యాయం పైన చిత్ర పరిశ్రమ నుండి గాని, ఆంధ్ర స్ఫూర్తి దారులు గాని ముందుకు వచ్చి "ఆంధ్ర ఫైల్స్"సినిమా ద్వారా వెలుగు చూడని వాస్తవ ఘటనలను ఆంధ్రప్రదేశ్ లో గల నేటి తరానికి తెలియ చేయాలని అందుకు నేను సైతం అని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు.సభకు ఆర్పిసి నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు  అధ్యక్షత వహించారు. 
ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ ఎమ్ డి హుస్సేన్ , సిమ్మా దుర్గారావు, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, వాడపల్లి  జ్యోతిష్, మాసా అప్పాయమ్మ, పిల్లాడి ఆంజనేయులు , ఇళ్ల శైలజ , వనుం సతీష్ ,  తదితరులు పాల్గొని యున్నారు. 
మేడా శ్రీనివాస్, MA, LLM, MA(Jour)అధ్యక్షులు, 
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్మొబైల్ నెం  : 9248777222.