రాజకీయ అత్సుత్సాహంకు ఆంధ్ర - తెలంగాణా భవిష్యత్ హం ఫట్ అవుతుంది .
కేసీఆర్ మేకపోతు గాంబిరం,జగన్ పాలనా వైఫల్యం రెండు రాష్ట్రాలకు అంగవైకల్యంతో సమానం.
తెలుగు రాష్ట్రాల విభజన ఢిల్లీ పెద్దలకు వరం గా మారింది . తెలంగాణా రాష్ట్రం కు కేసీఆర్ నాయకత్వం లోపం ఆంధ్రప్రదేశ్ కు సినిమా రంగం లోపం.
మేడా శ్రీనివాస్, విశ్లేషణ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
-ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల సఖ్యత తోనే రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి భవిష్యత్ అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు.
కేసీఆర్ మూర్ఖత్వం, చంద్రబాబు రాజకీయ దాహం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లకు తీరని ద్రోహం చేసాయని, రెండు రాష్ట్రాలు విభజింపబడితే
ఆ రాష్ట్రాలకు ఉజ్వల భవిష్యత్ వుండాలని, ఆలా కాకుండా అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు విభజన అనంతరం ఎంతగానో నష్టపోయాయని, రెండు రాష్ట్రాల్లోను అమాయక ప్రజలను రెచ్చగొట్టి ప్రధాన రాజకీయ పార్టీలు సొంత లాభాలు పొందాయని, విడిపోతే బంగారు తెలంగాణా అన్న కేసీఆర్ మత్తు మాటలు తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కి తీరని ద్రోహం జరిగిందని, ప్రాణత్యాగాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణా రాష్ట్రం కేసీఆర్ కుటుంబ బాగుకే ఉపయోగ పడిందని, విభజన అనంతరం ఉద్ధరిస్తాం అని సొల్లు మాటలు చెప్పిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అధికార, పక్ష నేతలు రెండు రాష్ట్రాలను అప్పుల కుప్పలు చేసి ప్రజల నెత్తిన మోయలేని భారం మోపారని, దిన దినం పేదరికాన్ని పెంచి పోషిస్తు నేతల అవినీతి ఖజానాన్ని పెంచుకుంటున్నారని, సిగ్గులేని పాలనతో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆస్తులు ఆమ్నెస్తున్నారని, తెలంగాణా లో ప్రజల శ్రమను దోచుకుంటున్నారని, రెండు రాష్ట్రాలు ప్రగతి లేని దీన స్థితిలో వున్నాయని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఆత్మగౌరవరం పేరుతో రెండు రాష్ట్రాల్లోని ప్రజా ఉద్యమాలకు కొంతమంది అగ్గి రాజేసారని, కేసీఆర్ కదల కుండా ఇంట్లో కూర్చొని విద్యార్థుల ఆవేశాన్ని రెచ్చగొట్టి తెలంగాణా ఉద్యమానికి వ్యూహ రచన చేసారని, కేసీఆర్ చెప్పిన నేటి తెలంగాణా వస్తుందంటే తెలంగాణా పౌరులు ఆత్మ బలిదానాలు చేసేవారు కారని, అమరుల కుటుంబాలకు క్షోభ పెట్టె వారు కారని, ఆనాడు సమైఖ్యఆంధ్రా పేరుతొ జరిగిన ఉద్యమం కొంతమంది బాగుకోసం జరిగిందని, విభజన సమయం లోనైనా కేంద్ర ప్రభుత్వం వద్ద రెండు రాష్ట్రాలకు అభివృద్ధికి కావలసినవి అడగకుండా రెండు రాష్ట్రాల్లోను ఆరని జ్వాలగా వుండే విధంగా పంపకాలు జరిగాయని, అశాస్త్రీయ మైన విభజన కు కేంద్ర పెద్దలును ఊ అనిపించారని, ఢిల్లీ ఉద్యమాలు పేరుతొ స్థానికుల దృష్టి మళ్లించారని,ఆనాడు సమైఖ్యఆంధ్రా ఉద్యమాలు అన్ని కేంద్ర ప్రభుత్వానికి నెప్పి కలగకుండా ఒప్పంద ఉద్యమాలే ఎక్కువగా జరిగాయని, కేసీఆర్ దొంగ దీక్షలుతో తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టె విధంగా ఖరీదైన ప్రచారాలను కేసీఆర్ బృందం ప్రోత్సహించిందని,
వీరి స్వార్థానికి రెండు రాష్ట్రాల భవిష్యత్ తో పాటుగా అమాయక యువత జీవితాలు నాశనమై పోయాయని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.
కేసీఆర్ మాటల గారడీతోను, మేకపోతు గాంబిరంతోను, జగన్ పాలనా బలహీనతలతోను తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందవని, సొల్లు కబుర్లు తోను, పాలనా అసమర్ధత తోను తెలుగు రాష్ట్రాల్లో సామాన్య ప్రజలు అల్లాడి పోతున్నారని, ఆకలితో అలమటిస్తున్నారని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలుగు రాష్ట్రాల్లో యువత వలస బాట పడుతున్నారని, పట్టభద్రులు సైతం కేసీఆర్, జగన్ పాలనలో కూలి పనులు చేస్తున్నారని, తెలంగాణా లోను, ఆంధ్ర లోను సామాన్య ప్రజలు,క్రింది స్థాయి ఉద్యోగులు కేసీఆర్ జగన్ పోకడలకు భయపడుతు వారి హక్కులను ఒదులు కుంటున్నారని,
తెలంగాణా లో హైదరాబాద్ మినహాయించి మిగిలిన జిల్లాలు అన్ని అభివృద్ధి, ఉపాధి అవకాశాలు లేని రాష్ట్రం గా తెలంగాణా ప్రజలు జీవితాలు చాలిస్తున్నారని, ఆంధ్ర లో ప్రభుత్వ ఖజానాలో వుండాల్సిన సొమ్ములు నేతల ధాన్యా గారాల్లో సేద తీరుతున్నాయని, పథకాలకు సైతం పంచటానికి నిధులు లేవని, ప్రభుత్వ ఆస్తులు, దేవుడు ఆస్తులు కూడా ప్రయివేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారని, విలువైన ఆస్తులు బ్యాంకుల్లో కుదువ పెట్టేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదను స్కెలిటన్ వలే చేస్తు భావితరాల భవిష్యత్ ను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన ఢిల్లీ రాజకీయ పె(గె)ద్దలకు, కార్పోరేట్, విదేశి బహుళ జాతి సంస్థలకు మాత్రమే మేలు చేకూర్చిందని, రాజకీయ సొంత ప్రయోజనాలు పై కాకుండా అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులు పై దృష్టి సారించే పాలకులు రెండు తెలుగు రాష్ట్రాల్లోను లేకపోవడం ఏపి, తెలంగాణా ప్రజల దురదృష్టం అని, నిరంతరం కేసీఆర్ ఆంధ్ర, తెలంగాణా ప్రజల మధ్య అగ్గి రాజేస్తు రాజకీయ లబ్ది పొందటం, జగన్ కక్ష పూరిత రాజకీయాలకు ప్రాధాన్యతను ఇచ్చుకోవటమే ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రుల పాలనా తీరు అని, తెలంగాణా రాష్ట్రం కు కేసీఆర్, కేసీఆర్ కుటుంబ నాయకత్వ లోపంగా భావించాలని, ఆంధ్రప్రదేశ్ కు సినిమా రంగంలో కొంతమంది ప్రముఖ హీరోలుగా చలామణి అవుతున్న వారు శాపంగా మారారని , సినిమా రంగంలో చివర దశలో వున్నవారు, అవకాశాలు తగ్గుతున్న అగ్ర హీరోలుగా చలామణి అవుతున్న వారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కలుషితం చేస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలును సొంత ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారని, నేటివరకు తెలుగు సినిమా పరిశ్రమ నుండి రాజకీయాల వైపు వచ్చిన ఏ ఒక్కరు ప్రస్తుత తెలుగు రాష్ట్రాలకు మేలు చేయలేక పోయారని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రజలు సఖ్యతగా వుంటేనే రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, తెలంగాణా లో కేసీఆర్ ను, ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది సినిమా వాళ్ళను, ప్రధాన రాజకీయ పార్టీలను భూ స్థాపితం చేసి నూతన మార్పుకై విప్లవాత్మక చైతన్యం తో ప్రజా స్వామ్యాన్ని ప్రజలు స్వాగతించిన నాడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు అద్భుత మైన ఉజ్వల భవిష్యత్ అని,రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతగాను బలంగాను వుంటే ఢీల్లీ పె(గె)ద్దలకు, కార్పోరేట్, విదేశీ సంస్థలకు తెలుగు వారంటే గౌరవం, నమ్మకం, ఒకరకమైన విలువలుతో కూడిన భయం వుంటుందని, అందుకోసం ఆంధ్ర, తెలంగాణా ప్రజలు సంయుక్తంగా ఒక బలమైన కార్యాచరణకు సిద్ద పడాలని, అందుకు మేము సైతం అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు. ఈ సభకు ఆర్పిసి నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ కాసా రాజు, దుడ్డె త్రినాద్, దుడ్డె సురేష్ , వర్ధనపు శరత్ కుమార్, ఎండి హుస్సేన్, సిమ్మా దుర్గారావు , మేడిచర్ల శ్రీనివాసరావు, పిల్లాడి ఆంజనేయులు, వల్లి శ్రీనివాసరావు,
ఎస్ కే వలి , వల్లి వెంకటేష్, ఎస్ కే చాన్ భాష , కోట సుశీల , రెడ్డి స్వర్ణ లత తదితరులు పాల్గొనియున్నారు.
--మేడా శ్రీనివాస్,
వ్యవస్థాపకఅధ్యక్షులు,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్