భీమునిపట్నం జనసేవ న్యూస్. సన్ స్కూల్ ఆధ్వర్యంలో ఎన్ సి సి విద్యార్థులతో మన భీమిలి మన బీచ్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఆదివారం భీమిలి బీచ్ లో పేరుకుపోయిన చెత్తను వ్యర్ధాలను తొలగించి పరిశుభ్రం చేసారు.
స్కూల్ డైరెక్టర్ కైతపల్లి శ్రీనివాస్ ఆదేశాలతో ఎన్.సి.సి విద్యార్థులతో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం చేపట్టామని ప్రిన్సిపాల్ పి.అరుణ్ తెలిపారు,
ఈ కార్యక్రమంలో పిఇటి పి. అరుణ్ కుమార్ మరియు సన్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చిన వ్యర్ధాలను దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డుకు తరలించారు.