పార్టీలకు అతీతంగా మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించాలి : లెంక సురేష్


 పాయకరావుపేట: పాయకరావుపేట పేట లో తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తెలుగునాడు విద్యార్థి సమైక్య నియోజకవర్గ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో విద్యావ్యవస్థ ను పూర్తి గా రాజకీయం కోణంలో చూస్తున్నారు అని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ లో జరగనున్న మెగా జాబ్ మేళాను
జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా వైఎస్సార్ జాబ్  మేళ ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు.


అసలు పార్టీ లకు సంబంధించిన కార్యక్రమాలను ను ఇలా యూనివర్సిటీ లో నిర్వహించకూడదు అని ఏయూ పెద్దలకు తెలియదా అని, వైసీపీ పార్టీ కి సంబంధించిన వారికి ఉద్యోగాలు ఇస్తే మన రాష్ట్రంలో  ఉన్న సుమారు 7-లక్షల  నిరుద్యోగులు సంగతేంటి అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళా లేక వైయస్సార్ సిపి పార్టీ కోసం పార్టీ నిర్వహిస్తున్న జాబ్ మేళా న తెలియజేసి, అప్పుడు నిర్వహించాలి అని, పార్టీలకు  అతీతంగా ఈ జాబ్ మేళా నిర్వహించాలని లేదంటే ఇలా పార్టీకి సంబంధించిన జాబ్ మేళా లు యూనివర్సిటీల నిర్వహించడానికి వీలులేదు అని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే వరకు టీఎన్ఎస్ఎఫ్ అండగా ఉండి పోరాడుతూనే ఉంటుందని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పెదిరెడ్డి నాగ వెంకటరమణ, నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పిర్ల గోవింద్, తోనంగి అప్పలరాజు, కోరుకుండ దుర్గా ప్రసాద్,  నియోజకవర్గ విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.