భాస్కర్ సేవలు ఎనలేనివి...!

భాస్కర్ సేవలు ఎనలేనివి...!
జర్నలిస్ట్ పవర్:ఆనందపురం
 జనసేవ ఎడిటర్ భాస్కర్ రావు సేవలు ఎనలేనివని టిడిపి యువ నాయకుడు, వేములవలస ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ కొనియాడారు.అతని మృతి తీరని లోటుగా అభివర్ణించారు. పత్రికా పరంగా విశిష్ట సేవలు అందించడమే కాకుండా సామాజిక దృక్పథంతో ముందుకు వెళ్లే మంచి మనిషిగా వ్యాఖ్యానించారు. ఇటువంటి కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అందరూ చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులందరూ మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని కోరారు.