చిట్టివలస చరిత్రకు చెదలు పట్టిన రోజు.

చిట్టివలస చరిత్రకు చెదలు పట్టిన రోజు.
 తగరపువలస జనసేన న్యూసే:- 
జూట్ మిల్లు నిలిపి వేసి ఆరు వేలు మంది కార్మికుల జీవితాలను అంధకారంలో నెట్టి చిట్టివలస చరిత్రకు చెదలు పట్టి,చీకట్లోకి నెట్టి వేయబడిన రోజుగా, చిట్టివలస చరిత్రలో చీకటి రోజు(బ్లాక్ డే)గా టిడిపి పార్లమెంటరీ సెక్రటరీ పిట్ట సురేష్ అభివర్ణించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో స్థాపించబడిన చిట్టివలస జూట్ మిల్ దినదిన ప్రవర్ధమాన చెంది సుమారు ఆరువేల మంది కార్మికులకు 2009 ఏప్రిల్ 20వ తారీఖున జూట్ మిల్లు వినాశనానికి నాంది పలికినరోజురన్నారు. బ్రిటిష్ పాలనలో స్థాపించబడిన చిట్టివలస జూట్ మిల్ దినదిన ప్రవర్ధమాన చెంది సుమారు ఆరువేల మంది కార్మికులకు ప్రత్యక్షంగానూ పదివేల మంది కుటుంబాలకు పరోక్షంగానూ ఉపాధి చూపిందన్నారు. భీమునిపట్నం నియోజకవర్గంలోనే అత్యధిక మందికి ఉపాధి చూపించిన మొదటి సంస్థ చరిత్రలో నిలిచి,ఎంతోమంది క్రీడాకారులను ప్రోత్సహించి ఫుట్బాల్, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ , టెన్నిస్ క్రీడల్లో జాతీయ స్థాయి లో సత్తా నిరూపించుకోవడానికి దోహదపడిందన్నారు. అన్ని క్రీడలకు అవసరమైన ఆట ప్రాంగణాలు ఈ జ్యూట్ మిల్ పరిధిలోనే ఉండేవి. చిట్టివలస జూట్ మిల్లు ఉద్యోగం అంటే ఎంతోమంది తమ గ్రామాలను వదిలి జూట్ మిల్ లో ఉద్యోగం కోసం వెంపర్లాడే వారున్నారు. 2009 ఏప్రిల్ 20వ తేదీన ఉపాధి కోల్పోయిన ఆరువేల మంది కార్మికుల బ్రతుకులు చీకట్లో కలిసిపోయాయి నేడు చిట్టివలస ప్రాంతమంతా కళావిహీనంగా మోడు బారిన చెట్టు లాగా తయారయిందన్నారు. మళ్లీ ఈ ప్రాంతం ఉపాధి అవకాశాలు మెరుగు పడి చిగురిస్తోందని ఆశిస్తూ ప్రాంత వాసులు అందరూ ఎదురుచూస్తున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేన న్యూసే