ఆంధ్రుల కుఅన్యాయం చేసిన విదేశీ కాంగ్రెస్. ను.. తరిమేయండి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్

-------------
విదేశీ కాంగ్రెస్ ను సాగనంపండి ! స్వదేశీ పార్టీలను స్వాగతించండి !

ఇటలీ కాంగ్రెస్ సోనియా గాంధీ కి ప్రతి ఆంధ్రుడు బుద్ది చెప్పాలి. 

అశాస్త్రీయ మైన విభజన తో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన సోనియా గాంధీ. 

ఆంధ్రుల అభివృద్ధి పై ఆనాటి నెహ్రూ నుండి నేటి సోనియా గాంధీ వరకు విషం కక్కుతూనే వున్నారు. 

కాంగ్రెస్ విష వృక్షం భారత్ కు కాలుష్య భూతం వంటిది. 
-------------
మేడా శ్రీనివాస్, విమర్శ, 
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ 
-------------
బ్రిటిష్ వారిని తరిమి నట్టు ఇటలీ కాంగ్రెస్ ను తరిమి వేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రులను కోరారు. 

బ్రిటిష్ పాలకులను, మూలలను భారతీయులు తరిమివేసినా కాంగ్రెస్ రూపంలో భారత్ ను ఇటలీ కాంగ్రెస్ వెంటాడుతూనే వుందని, కాంగ్రెస్ (ఐ)అంటే ఆనాడు ఇందిరా కాంగ్రెస్ గాను, నేటి కాంగ్రెస్ (ఐ)అంటే ఇటలీ కాంగ్రెస్ అని ఆంధ్రుల గమనించాలని, స్వదేశీ పాలనను, స్వదేశీ పార్టీలను భారతీయులు ప్రోత్సహించాలని అందుకు ముందుగా ఆంధ్రులు ఆదర్శం గా నిలవాలని, భారతదేశంలో పేదరికం, తీవ్రవాదం పెరగటానికి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టి కారణం అని, కాంగ్రెస్ పెంచి పోషించిన తీవ్రవాదంను భారత్ లో కొన్ని స్వదేశీ పార్టీలు కూడా పెంచి పోషిస్తు భారత్ లో శాంతి భద్రతల సమస్యలకు కారకులైతున్నారని,
కాశ్మీర్ సమస్యను తీవ్రవాదం వైపు మళ్లించి దేశ సంపదలో 50% కాశ్మీర్ లోనే వెచ్చిస్తున్నాం అని  వాస్తవాలను వెలుగు చూడనీయకుండా చేసింది కాంగ్రెస్ కాదా  ! అని, కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలు సైతం కాంగ్రెస్ చూపిన దారిలోనే నడుస్తు దేశ సంపదను కొల్లగొడుతున్నారని, నెహ్రూ దేశ భద్రతను రాజకీయ లబ్ధికి మలుచు కున్నారని, ఇందిరా గాంధీ పంజాబ్ చండీఘర్ ప్రాంతాలలో తీవ్రవాద సమస్యలకు ఆజ్యం పోసి రాజకీయాలను శాసించారని, రాజీవ్ గాంధీ పరాయి దేశ తీవ్రవాదాన్ని భారత్ వైపు మళ్లించారని, సోనియా గాంధీ భారత్ ను అతలాకుతలం చేస్తు కుంభకోణాలను పెంచి పోషించి ప్రాంతీయ ఉన్మాద అరాచకాలను  తెరవెనుక నుండి ప్రోత్సహించి విదేశీ వ్యాపార సామ్రాజ్యాన్ని భారత్ లో ప్రోత్సహించిందని ఆయన పేర్కొన్నారు. 

ఎంతో శక్తి వంతమైన భారతదేశం లో గొప్ప గొప్ప వీరులు, పాలకులు వున్నారని, పాలనను కలుషితం చేస్తు భారత్ లో ఆర్ధిక మూలాలు పతనావస్థకు చేరుకోవటానికి ముందుగా విత్తు నాటింది గాంధీ కుటుంబమేనని, ఆనాడు బ్రిటిష్ పాలకులు రెండు వందల సంవత్సరాలు భారత్ ను ఏలారు అంటే అందుకు ఆనాటి కాంగ్రెస్ లో కొన్ని విష వృక్షాలుతో పాటుగా గాంధీ కుటుంబమే కారణమని, గాంధీ కుటుంబం మూలంగా భారత్ ఎంతగానో నష్ట పోయిందని,నేతాజీ మరణం వెనుక,భగత్ సింగ్ , గుర్ గావ్, 
రాజ్ గుర్, సుక్దేవ్ , ఆజాద్ చంద్రశేఖర్ వంటి యుద్ధ వీరుల   మరణ ఘటనల వెనుక నెహ్రూ కుట్ర దాగి వుందని, భారతదేశ చరిత్రలో గాంధీ కుటుంబానిది కల్పిత చరిత్ర అని, స్వాతంత్ర్య పోరాటం కై భారతీయ యువత ప్రాణాలొడ్డి పోరాడుతున్న తరుణంలో నెహ్రూ బ్రిటిష్ హై కమాండ్ పెద్దలతో విలాశ జీవితం గడిపారని, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న యుద్ధవీరుల స్థావరాలను బ్రిటిష్ వారికి ఉప్పు అందించే వారని, స్వాతంత్ర్య పోరాటంలో వీర మరణం పొందిన వారిలో అనేకులు గాంధీ కుటుంబ పోకడలకు బలైన వారేనని, భారత్ లో వాస్తవ చరిత్రను, ఘటనలను వెలుగు చూడనీయ కుండా చరిత్రలో గాంధీ కుటుంబ చరిత్రకు అచ్చు వేయించుకున్నారని  ఆయన తీవ్ర ఆరోపణ చేసారు.

ఆంధ్రప్రదేశ్ పై సోనియా గాంధీ విషం కక్కిందని, అశాస్త్రీయ మైన విభజన జరిపి ఆంధ్రులకు తీవ్ర మైన ద్రోహం చేసారని, ఆనాడు విభజన ఉద్యమానికి కేసీఆర్ కు నిధులు సమకూర్చి అరాచకాన్ని ప్రోత్సహించింది ఇటలీ కాంగ్రెస్ కదా ! అని, విభజన చట్టం ను ఉద్దేశ్య పూర్వకంగానే సోనియా గాంధీ కనుసైగలో బలహీన పరిచారని, ప్రత్యేక హోదా, విభజన హామీలు ఆంధ్రులు పొందలేక పోవటానికి ప్రధాన కారణం సోనియా గాంధీ కుయుక్తులే కారణంఅని, 
టి ఆర్ ఎస్ పార్టిని కాంగ్రెస్ లో విలీనం చేస్తాను అని సోనియా గాంధీ ని కేసీఆర్ నమ్మించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడని విధంగా ఆనాడు ఆంధ్ర కు సోనియా గాంధీ తో అన్యాయం చేయించారని,కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కు సోనియా గాంధీ చేసిన మేలు 
ఏ ఒక్కటైనా వుందా అని, ఎన్నో అపార ఖనిజ వనరులు వున్న ఆంధ్ర రాష్ట్రం నేడు ఉద్యమాలతో అట్టుడికి పోవటానికి, అభివృద్ధి అడుగంటి పోవటానికి సోనియా గాంధీ రాజకీయ రాక్షస క్రీడే కారణమని, ఇటలీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నా, ఆంధ్రులు బలంగా వున్నారన్నా నేటి ఇటలీ కాంగ్రెస్ కు వణుకు పుడుతుందని, భారత్ లో విదేశి వ్యాపార సామ్రాజ్యన్ని భారత్ లో  ముందుగా స్వాగతించింది ఇటలీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ రాజకీయ దాహనికి కార్మిక హక్కులు కాలరాసి పోయాయని ఆయన తీవ్ర ఆవేదన చెందారు.

ఆంధ్రుల అభివృద్ధి పై ఆనాటి నెహ్రూ నుండి నేటి సోనియా గాంధీ వరకు కాలకూట విషం చిమ్ముతూనే  వున్నారని, కాంగ్రెస్ విష వృక్షం భారతదేశం కు కాలుష్య భూతం వంటిదని,నేటి ఇటలీ కాంగ్రెస్ గాలి తగిలిన చోట అభివృద్ధి నిర్వీర్యం అయిపోతుందని, ప్రాంతీయ ఉన్మాద అరాచకాలు పెరిగిపోతాయని, లౌకిక వాదం ముసుగులో ముష్కర ఉపన్యాసాలు గుప్పిస్తారని,భారత్ ను అత్యధిక శాతం కాంగ్రెస్ పార్టి పాలించిందని,
వీరి పాలనలో కుంభకోణాలు, తీవ్రవాద సమస్యలు, నియంతృత్వ పాలన తప్ప మెరుగైన పాలనను ప్రజలు చూడలేక పోయారని,ఆనాటి బ్రిటిష్ పాలకులకు బ్రిటిష్ వారిపై భారతీయుల కు గల వ్యతిరేకతను పితూరిలుగా చెప్పి సంపన్నులు చలామణి అయిన వారే కాంగ్రెస్ లో ఎక్కువ శాతం వున్నారని, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి తూట్లు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టి అని,భారతీయ చారిత్రిక పుటల్లో నుండి నెహ్రూ కల్పిత చరిత్రను తొలగించాలని ఆయన డిమాండ్ చేసారు. 

నా ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసిన ఇటలీ కాంగ్రెస్ కు  ఆంధ్రులు తగిన గుణపాఠం చెప్పాలని, సోనియా ఆంధ్ర కు చేసిన పాపం, అహంభావం ధోరణికి  ఆంధ్రుల భవిష్యత్ తీవ్రంగా నష్టపోయిందని, సోనియా గాంధీ, ఆమె బృందం ఆంధ్ర కు చేసిన మహా పాపానికి గుణపాఠంగా కాంగ్రెస్ పార్టీ  దేశ వ్యాప్తంగా పతనం అవుతుందని, ఆమె బృందానికి ఆంధ్రలో రాజకీయ చిరునామా లేకుండా పోయిందని,ఆధ్రులు ఢిల్లీ పార్టీలను, ఇటలీ కాంగ్రెస్ ను సాగనంపి పూర్తి స్థాయి స్వదేశీ పార్టీలను, స్వదేశీ పాలకులను స్వాగతించాలని,
ప్రత్యేక హోదా విభజన హామీల సాధనకై ఆంధ్రులు ఈ దఫా మోసపోకుండా ఓటు హక్కు ద్వారా ఢిల్లీ పార్టీలకు బుద్ది చెప్పాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రులకు పిలుపు నిచ్చారు. 

సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు  అధ్యక్షత వహించారు. 

ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ లంక దుర్గాప్రసాద్ , 
దుడ్డె సురేష్ , వల్లి వెంకటేష్, వాడపల్లి జ్యోతిష్,  పిల్లాడి ఆంజనేయులు, మార్త ప్రభాకర్, బర్ల బద్రరావు, కోట రాజశేఖర్, కోట సుశీల, రెడ్డి స్వర్ణ లత, రెడ్డి అఖిల్  పాల్గొనియున్నారు. 

--
మేడా శ్రీనివాస్, 
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్