అభివృద్ధి, ఉపాధి లేని ఏపి కి జిల్లాల విభజన అవసరమా !

ప్రెస్ నోట్, 
ది 11-4-2022, 
రాజమండ్రి. 
-------------
అభివృద్ధి, ఉపాధి లేని ఏపి కి జిల్లాల విభజన అవసరమా  !

గిరిజన ప్రాంతాలన్నిటికి మరో జిల్లా అట !

26 జిల్లాలకు చట్టబద్దమైన రాజధాని పేరు చెప్పగలరా  !

ప్రజల మనోభావాలు, చారిత్రిక మూలాలు మంటగలిచే  విధంగా జిల్లాలు విభజన. 

జిల్లాల విభజన లో కలెక్టర్ల స్థాయి తగ్గింది. 
-------------
మేడా శ్రీనివాస్, విశ్లేషణ, 
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ 
-------------
రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు 26 జిల్లాలా ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆక్షేపణ చేసారు. 

విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు పక్కా రాజధాని లేదని, యావత్ భారతదేశం లోనే రాజధాని లేని రాష్ట్రంగా అవమానానికి గురైతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, భారత ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి కి నేడు చట్టబద్దత లేకుండా పోయిందని, ఆంధ్రప్రదేశ్ కు జాతీయ స్థాయిలో ఇంత ఘోరమైన అవమానం జరుగుతున్నా ఆత్మాభిమానాన్ని రక్షించుకోలేక పోతున్నారని, ఆనాటి ఆంధ్రుల పౌరుషం కానరాక పోవటం నేటి ఆంధ్రుల దురదృష్టం అని, ఆంధ్రుల మేధస్సు కు, వెన్నుచూపని పోరాట పటిమకు ఆంధ్రులకు ఎనలేని చారిత్రిక స్థానం వుందని,పాలకుల స్వార్థానికి ఆంధ్రుల ఉద్యమ స్ఫూర్తిని అధికారికంగా వేధిస్తు భయాందోళనకు గురిచేస్తున్నారని,
ప్రశ్నించే గొంతును కాలితో తొక్కేస్తున్నారని, ఆంధ్రాలో బిడ్డల భవిష్యత్ కానరావటం లేదని, జాతీయ స్థాయిలో ఆంధ్ర రాజధాని అంటే హేళనగా మాట్లాడు చున్నారని, పాలకుల బలహీనతలకు ఆంధ్రప్రదేశ్ నవ్వుల పాలు అవుతుందని, భారతదేశ ప్రధాని సైతం ఏపి భవిష్యత్ పై విషం కక్కటం క్షమించరాని తప్పిదమని ఆయన తీవ్ర ఆవేదన చెందారు.

గిరిజన ప్రాంతాలన్నింటికీ మరొక జిల్లా ప్రకటిస్తాం అని చెప్పుకొస్తున్న జగన్ బృందం భవిష్యత్ లో ప్రతి మండలం ఒక జిల్లాగాను, కులానికో జిల్లాగాను ప్రకటించి  ఆంధ్రప్రదేశ్ ను చింపిన విస్తరి చేస్తారా  ! అని, అభివృద్ధి పై దృష్టి సారించకుండా ఏపి ని ముక్కలుగా విభజిస్తాను, మూడు రాష్ట్రాలు చేస్తాను, చారిత్రిక జిల్లాల స్వరూపాలను ముక్కలుగా చీలుస్తాను అనే పాలన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు మంచి పరిణామాలు కావని ఆయన సూచించారు.

ప్రస్తుత 26 జిల్లాలకు అధికారికంగా ఏపి సర్కార్ రాజధాని పేరు చెప్పగలదా  !  రాజధాని లేకుండా భారతదేశం లో 
ఏ ఒక్క రాష్ట్రం అయినా వుందా  ! అని, ఆంధ్రులు రాజధాని పేరు చెప్పుకోలేని దుస్థితిలో అవమానంతో జీవిస్తున్నారని, దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ శాపానికి గురైతునే వుందని, మన రాష్ట్రం నుండి వనరులు దోచుకు పోవటంపై వున్న ఆశక్తి ఏపి అభివృద్ధి పై ద్రుష్టి సారించటంపై పెదవి విరుస్తున్నారని , ఓటర్లు సైతం ఆంధ్ర వ్యతిరేక పార్టీలకు, శక్తులకు బానిసలుగా మారటమే ఇందుకు కారణంగా భావించాలని ఆయన తెలిపారు. 

ప్రస్తుతం విభజన జరిపిన తీరు జిల్లాల ప్రజల మనోభావాలను, జిల్లాల చారిత్రిక మూలలను, మూల ఘట్టాల ప్రతిష్టను మంట గలిచే విధంగా 26 జిల్లాల విభజన జరిగిందని, జిల్లాల విభజన కారణంగా కలెక్టర్ల స్థాయిని 
ఆర్ డి ఓ ల స్థాయికి తగ్గించి ఐ ఏ ఎస్ ల సామర్ధ్యాన్ని, వారి ఖ్యాతిని తగ్గించారని, ప్రజలు మోనం కారణంగా ముందు ముందు కలెక్టర్ల స్థాయిని బిల్లు కలెక్టర్ల స్థాయికి దిగజార్చి సివిల్ సర్వీస్ ప్రతిష్ట ను మంటగలుపుతారని ఆయన పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక గొప్ప రాజధాని ని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను, మౌలిక సదుపాయాలను, మౌలిక అవసరాలను, మెరుగైన విద్య, వైద్యం ను, ప్రత్యేక హోదా, విభజన హామీలను, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ను, విశాఖ లో డివిజన్ తో కూడిన రైల్వే జోన్, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, రాజమండ్రిలో 100 కోట్లతో సంస్కృతిక అకాడమీ, రామాయపట్నం మేజర్ పోర్ట్, కడప ఉక్కు ప్యేక్టరీలను కోరుకుంటున్నారని, వీటి కోసం మాట్లాడే దమ్మున్న నేతలు ఏపిలో లేకపోయారని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. 

దశాబ్దాలుగా హైదరాబాద్ కు సుప్రీం కోర్టు బెంచ్ ను, శ్రీకాకుళం, రాజమండ్రి, కర్నూల్ లో హై కోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలని ప్రజల నుండి విజ్ఞాపనలు వున్నాయని, ఏపి, తెలంగాణా నుండి 
ఈ అంశాలపై పార్లమెంట్ లో వాణి వినిపించే నేతలు నేటి వరకు కానరాక పోవటం తెలుగు రాష్ట్రాల దురదృష్టం అని ఆయన ఎద్దేవా చేసారు. 

ప్రస్తుత పాలకులు, ప్రధాన రాజకీయ పార్టీల తోను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు పెను ప్రమాదం పొంచి వుందని, ఇప్పటికే అప్పులు తోను, ఆర్ధిక సంక్షోభం తోను ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారని,
విదేశీ కార్పొరేట్ సంస్థల దోపిడి కారణంగా ప్రకృతి వనరులు విష పూరితంగా మారి ప్రజల ఆరోగ్యాలు క్షిణిస్తున్నాయని, మన జీవితాలకు, మన బిడ్డల భవిష్యత్ కు మనమే హీరోలమని భావించి ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమ నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం,అన్ని వర్గాల ప్రజలను సంపన్నులుగా స్థిరపడనిద్దాం, అందుకు ప్రజలు స్వచ్చందంగా 
జై ఆంధ్ర, సేవ్ ఆంధ్ర అంటు ఈ మహోన్నత ఉద్యమం లో భాగస్వాములు కావాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. 

సభకు ఆర్పిసి నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు  అధ్యక్షత వహించారు. 

ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి, లంక దుర్గాప్రసాద్ , 
దుడ్డె సురేష్, వల్లి శ్రీనివాసరావు, దుడ్డె త్రినాద్, వర్ధనపు శరత్ కుమార్,  వాడపల్లి జ్యోతిష్ , ఎస్ కె వల్లి, పిల్లాడి ఆంజనేయులు , మాసా అప్పాయమ్మ , దోషి నిషాంత్ , చాంద్ బాషా , రెడ్డి స్వర్ణలత , కోట సుశీల ,  కోట రాజశేఖర్ , కొల్లిమళ్ల లక్ష్మణరావు, పి ప్రసాద్ తదితరులు పాల్గొని యున్నారు. 

--మేడా శ్రీనివాస్, 
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
జనసేవ న్యూస్: 
 ఈ పోస్ట్ ని మీ ప్రియమైన వారి అందరికీ షేర్ చేయండి.