ఆనందపురం జనసేవ న్యూస్:
అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు స్థానిక పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడి చేసి 315 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం మేరకు స్థానిక సి ఐ రవి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్యాంసుందర్ సిబ్బంది మండలంలోని దుక్క వాణి పాలెం టోల్ గేట్ వద్ద పెందుర్తి వైపు నుండి అనందపురం వైపు వస్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 315 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, గంజాయి అక్రమంగా తరలిస్తున్న బీహార్కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు ఈ కేసును సీఐ వై రవి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్యాంసుందర్ దర్యాప్తు చేస్తున్నారు
ఆనందపురం రిపోర్టర్ సిహెచ్ శంకర్రావు
జనసేవ న్యూస్