ఐరన్ ఎలక్ట్రిక్ స్తంభాలతో తస్మాత్ జాగ్రత్త

ఐరన్ ఎలక్ట్రిక్ స్తంభాలతో తస్మాత్ జాగ్రత్త
భీమిలి పట్నం జనసేవ న్యూస్ : 
జీవీఎంసీ పరిధిలో చిట్టివలస, తగరపువలస. భీమునిపట్నం ప్రాంతాలలో గల ఐరన్ ఎలక్ట్రిక్ స్థంబాలు జంగు పట్టి శిథిలావస్థకు చేరుకొని ఆ స్తంభాలను తాకినపుడు షాక్ కొట్టే దశలో ఉన్నాయని అందుకు వాటితో ప్రజల అప్రమత్తంగా ఉండాలని టిడిపి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పిట్ట సురేష్ తెలిపారు. గతంలో ఏర్పాటుచేసిన ఇనుప స్తంభాలను తొలగించి వాటి స్థానంలో సిమెంటు పోల్స్ లోను అమర్చి ప్రమాదాల బారి నుండి ప్రజలను కాపాడాలని చిట్టివలస ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఏఈ విజయ్ కుమార్ కు ఇచ్చిన వినతి పత్రంలో కోరడమైనదని పేర్కొన్నారు. అందుకు ఎ.ఈ. విజయకుమార్ సానుకూలంగా స్పందిస్తూ
     వీలైనంత త్వరగా వినతి పత్రంలో కోరిన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్