ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడి ఇద్దరు అరెస్ట్

ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడి ఇద్దరు అరెస్ట్
  ఆనందపురం జనసేవ న్యూస్ :
మండలం లోని బొడ్డపాలెం గ్రామం లో ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నివాసంపై బుధవారం భీమునిపట్నం ఇన్స్పెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జె ఆర్ పురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బొడ్డు పాలెం లో ఒక ఇంట్లో నివాసముంటూ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తెలియడంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ, ఎస్ఐ డి పద్మావతి, సిబ్బంది దాడి చేశారు. ఈ మేరకు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 12 మొబైల్స్, ల్యాప్టాప్ రెండు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు అనంతరం తదుపరి చర్యల నిమిత్తం అనందపురం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ స్పెషల్ ఫోర్స్ మెంట్ బ్యూరో వి రామకృష్ణ తెలిపారు

భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్