ఘనంగా భీమిలి బార్ అసోసియేషన్ సభ్యులకు సన్మానం

ఘనంగా భీమిలి బార్ అసోసియేషన్ సభ్యులకు సన్మానం   
భీమిలి పట్నం జనసేవ న్యూస్: 

 భీమునిపట్నం బార్ అసోసియేషన్ అభ్యర్థులుగా గెలుపొందిన  అధ్యక్షుడు పి. సుందర్ సింగ్, కార్యనిర్వాహణాధికారి పి. ఎస్. కె. భరద్వాజ్ ,కోశాధికారి శ్రీమతి  కనకమహాలక్ష్మి లను భీమునిపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు యిచ్చి శాలువాలతో  ఘనంగా సన్మానించారు.శుక్రవారం భీమునిపట్నం బార్ అసోసియేషన్ మందిరములో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖపట్నం బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది గొల్ల గాని  అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరందరూ బార్ అసోసియేషన్ సభ్యులు గా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే మీరందరూ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని అన్నారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులను పుష్పగుచ్ఛాలు యిచ్చి  శాలువాతో సన్మానించారు. సందర్భంగా భీమిలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన పి సుందర సింగ్ మాట్లాడుతూ కష్టపడి చదివి న్యాయవాది వృత్తిలోకి వచ్చి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీ అందరూ సహకారంతో ఎన్నిక కావడం చాల సంతోషంగా ఉందన్నారు సభ్యుల అందరుసహకారంతో బార్ అసోసియేషన్  సమస్యలను పరిష్కరించి, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే  ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎం ఎస్ గౌతమ్   గెలుపొందిన అభ్యర్థులను పుష్పగుచ్ఛాలు శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో  అధ్యక్షుడుపి సుందర సింగ్ తో పాటు కార్యవర్గ సభ్యులు,,విశాఖపట్టణం బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది గొల్ల గాని అప్పారావు  ,సీనియర్ న్యాయవాది ఎం ఎస్ గౌతం ,ఇతర న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు

భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు
జనసేవ న్యూస్: 
 ఈ పోస్ట్ ని మీ ప్రియమైన వారి అందరికీ షేర్ చేయండి.