వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి

భీమునిపట్నం జనసేవ న్యూస్:-
భీమునిపట్నం జివిఎంసి పరిధిలో గల ప్రాంతాల్లో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని టి డి పి పార్లమెంటరీ సెక్రటరీ పిట్ట సురేశ్ అధికారులను కోరారు. వేసవి కాలం వచ్చిందంటే మంచినీటి సరఫరా అంతంతమాత్రంగానే జరుగుతుందని 
ప్రజలు ఏడాది పొడవునా ప్రతిరోజూ నీటి సరఫరా చేయడానికే పండ్లు చెల్లించినప్పడువేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన డిమాండ్ చేశారు. పన్నుల బకాయిలు వసూలు చేయడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించే అధికారులు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేయడానికి ప్రత్యేక చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
    భీమిలి పట్నం మున్సిపాలిటీ నుండి జివిఎంసి లో చేర్చి నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత కూడా ప్రజలు వ్యధలు తీరడం లేదని వాపోతున్నారని అన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని పరిష్కరించలేని నాయకత్వం ఎందుకు ఉన్నట్లు అర్థం కావడం లేదని వాపోయారు. ప్రభుత్వం, నాయకులు వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోండి అని జనవరి నుండి చెప్తూ కూడా అధికారుల చర్యల వలన ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంటుందని ఆయన చెప్పారు
వేసవి కాలం వచ్చేసరికి బోరుబావుల దగ్గరలో నీరు నిల్వ ఉండకపోవడం అలా నిలిచిన నీరు భూగర్భంలో చేరి జలనిధి గా మారడానికి అవసరమైన మేరకు ఇసుక మేటలు లేకపోవడం ప్రధాన కారణమైతే, బావుల ద్వారా సమకూర్చుకున్న నీటిని పంపిస్తున్న పైప్ లైన్లు చాలా చోట్ల లీకేజీలు కారణంగా నీరు వృధా కావడం. దీనివలన ఏటా రిపేర్లు కోసం లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని చెప్పారు.
నిరంతరాయంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను అరికట్టడం. వర్షం నీరు,తాటిపూడి రిజర్వాయర్ నుండి విడుదలైన నీరు బోరుబావుల దగ్గరలో నిల్వ ఉండడానికి అవసరమైన చెక్ డ్యాములు తగినంత ఎత్తులో నిర్మించడం.నీటి సరఫరా జరిగే పైపులైన్ స్థానంలో కొత్త పైపులైన్ ఏర్పాటు చేయడం.బావుల ద్వారా సమకూర్చుకున్న నీటిని మంచినీరు గా మార్చేందుకు అవసరమైన ఫిల్టరైజేషన్ ప్లాంటు నిర్మించడం. తదితర చర్యలు వలన నీటి ఎద్దడిని నివారించవచ్చని ఆకాంక్షించారు గానీ జీవీఎంసీ భీమునిపట్నం పరిధి ప్రజలకు మంచినీరు నిరంతరాయంగా అందించడానికి అధికారులు దృష్టిసారించి తగు చర్యలు తీసుకొని నీటి సరఫరా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు